తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Janasena chief Pawan Kalyan comments: జగన్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న అధికారులు సిగ్గుపడాలి: పవన్‌ కల్యాణ్‌ - Janasena pawan kalyan news

Janasena chief Pawan Kalyan comments: 40 ఏళ్ల అనుభవమున్న పార్టీ కూడా ప్రస్తుతం ఒడుదొడుకులను ఎదుర్కొంటోందని.. ఇటువంటి సమస్యల మధ్య పార్టీని నడుపుతున్నానంటే అది కేవలం రాజ్యాంగం ఇచ్చిన బలమేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జగన్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న కొంతమంది అధికారులపై పవన్‌ ధ్వజమెత్తారు.

Janasena_chief_Pawan_Kalyan_comments
Janasena_chief_Pawan_Kalyan_comments

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 8:29 PM IST

Updated : Sep 17, 2023, 6:36 AM IST

జగన్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న అధికారులు సిగ్గుపడాలి: పవన్‌ కల్యాణ్‌

Janasena Chief Pawan Kalyan Comments:జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారత రాజ్యాంగం, సనాతన ధర్మం, ఇండియా, భారత్‌ పేర్లపై స్పందించారు. రూల్ బుక్‌ (రాజ్యాంగం)ను ప్రజలంతా గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. 'ఇండియా దట్ ఈజ్ భారత్‌' అని రాజ్యాంగం మొదటి పేజీలోనే ఉందని.. బ్రిటిష్ వారికి 'భారత్‌' అని నోరు తిరగక 'ఇండియా' అని ఉండవచ్చని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ భారతీయుడిగానే మాట్లాడుతున్నాన్న పవన్.. 389 మంది మేధోమథనం చేయడం వల్ల మన రాజ్యాంగం వచ్చిందన్నారు. సనాతన ధర్మం.. తనను తాను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తుందన్నారు. కాలం, అవసరాలు, పరిస్థితుల మేరకు సనాతన ధర్మం మారుతుందని పవన్ వివరించారు.

JanaSena Party General Meeting Updates: గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో శనివారం నాడు పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, ప్రధాన కార్యదర్శి నాగబాబుతోపాటు రాష్ట్ర నలుమూలాల నుంచి విచ్చేసిన జనసైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఇప్పటి నుంచే పార్టీ కార్యకర్తలు ఎన్నికల కోసం చురుకుగా పని చేయాలని, వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీపై వైసీపీ చేసిన దుష్ప్రచారాన్ని గుర్తు చేసుకున్నారు.

Pawan Kalyan met Chandrababu in Rajahmundry Jail: జైల్లో చంద్రబాబుతో పవన్​కల్యాణ్​ ములాఖత్​.. భువనేశ్వరి, బ్రాహ్మణిలకు పరామర్శ

Pawan Kalyan Comments: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేటి సమావేశానికి నల్ల దుస్తులతో హాజరయ్యారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. సీఎం జగన్​, వైఎస్సార్సీపీ పథకాలు, ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్న కొందరి అధికారులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'ఇన్ని సమస్యల మధ్య పార్టీని నడుపుతున్నానంటే అది రాజ్యాంగం ఇచ్చిన బలమే. రూల్ బుక్‌ (రాజ్యాంగం)ను ప్రజలంతా గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఇండియా, భారత్‌ పేర్లపై దేశమంతా చర్చించుకుంటున్నారు. ఇండియా దట్ ఈజ్ భారత్‌ అని రాజ్యాంగం మొదటి పేజీలోనే ఉంది. బ్రిటిష్ వారికి భారత్‌ అని నోరు తిరగక ఇండియా అని ఉండవచ్చు. నేను ఎప్పుడూ భారతీయుడిగానే మాట్లాడుతున్నా. 389 మంది మేధోమథనం చేయడం వల్ల మన రాజ్యాంగం వచ్చింది.'' అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

Mulakhat with Chandrababu: చంద్రబాబుతో పూర్తయిన ములాఖత్.. పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan on Sanatana Dharma:అనంతరం సనాతన ధర్మంపై పవన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మం తనను తాను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తుందన్నారు. కాలం, అవసరాలు, పరిస్థితుల మేరకు సనాతన ధర్మం మారుతుందన్నారు. అందరినీ కలుపుకుపోవడం వల్లే దేశంలో ఏకత్వం నిలబడిందని పవన్ పేర్కొన్నారు. ద్వేషం, దోపిడీ ఎల్లకాలం ఉండదని.. మార్పును అంగీకరించి, ధర్మాన్ని పాటించినవారే దేశాన్ని నడపగలరని పవన్ కల్యాణ్ తెలిపారు.

Pawan Kalyan Fire on YSRCP Leaders:అధికారంలోకి వస్తే చాలు.. ఇష్టం వచ్చినట్లు చేయవచ్చని అనుకుంటున్నారని పవన్‌ కల్యాణ్ అధికార పార్టీ నాయకులపై ధ్వజమెత్తారు. జగన్ తెచ్చిన పథకాలు, కార్యక్రమాలు కొత్తవి కాదని పవన్‌ గుర్తు చేశారు. వైసీపీ నేతలకు కనువిప్పు కలిగించేందుకే రాజ్యాంగ ప్రతిని చూపించానని పవన్‌ వెల్లడించారు. ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న కొందరు అధికారులు సిగ్గుపడాలని దుయ్యబట్టారు. మమ్మల్ని ఎన్ని తిట్టినా భరించామన్న పవన్.. చేసేపని సరైందే, కాదో అని ఐపీఎస్‌ అధికారులకు అనిపించటంలేదా..? అని ప్రశ్నించారు. పదవి, అధికారం.. ఎవరికీ శాశ్వతం కాదని పవన్ కల్యాణ్‌ గుర్తు చేశారు. సొంత రాష్ట్రానికి వస్తున్న తనను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Janasena Will Come to Power in 2024: వైఎస్సార్సీపీని రాష్ట్రం నుంచి తరిమివేసేందుకు ఇదే సరైన సమయమని పవన్‌ కల్యాణ్ అన్నారు. 2024 ఎన్నికల తర్వాత అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటామన్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్ర దశ, దిశ మారుస్తామని ఆయన పేర్కొన్నారు. ఏ డాక్టర్‌కు చూపించినా జగన్‌కు మానసిక స్థితి బాగాలేదని చెబుతారని పవన్ ఎద్దేవా చేశారు. తాము గొడవ కోసం రాలేదని.. యుద్ధం కావాలంటే కురుక్షేత్రం తప్పదని పవన్‌ కల్యాణ్ హెచ్చరించారు. అనంతరం మరో 6 నెలల్లో తమ ప్రభుత్వం వస్తుంది.. అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Pawan Fire on Jagan Rule:రాష్ట్రంలోని దుర్మార్గపు పాలన గురించి ప్రజలందరూ ఆలోచించాలని జనసేన అధినేత పవన్‌ పిలుపునిచ్చారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఏం చేస్తే అది చెల్లదన్నారు. 'మా నేల మీదకు మమ్మల్ని అడుగుపెట్టకుండా అడ్డుకుంటారా..?, మాపై తప్పుడు కేసులు, హత్యాయత్నం కేసులు పెడుతారా..?, ప్రజలు తలుచుకుంటే కొట్టి కొట్టి చంపేస్తారు. మడ అడవులు అడ్డంగా నరికేసి పర్యావరణ విధ్వంసం చేశారు.' అని పవన్ అన్నారు.

Pawan Kalyan on Chandrababu Arrest: చంద్రబాబు ప్రజాస్వామికంగా ఉంటారు కాబట్టే తాను గౌరవిస్తానని పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యానించారు. త్వరలోనే కేంద్ర హూంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి, రాష్ట్రంలోని పరిణామాలను వివరిస్తానని పవన్‌ తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తుకు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని వెల్లడించారు. జగన్ క్రూరుడని ఆయనకు దగ్గరగా ఉండేవారు చెప్పారని పవన్‌ తెలిపారు. అత్యాశతో అన్నీ తనకే కావాలని జగన్ భావిస్తారన్నారు. సమయం వచ్చినప్పుడు పవర్ షేరింగ్‌పై మాట్లాడతామన్నారు. ఎన్నికల్లో గెలిచాక రాజు ఎవరో.. మంత్రి ఎవరో తేలుతుందన్న పవన్.. పొత్తులపై సమన్వయం కోసం మనోహర్ నేతృత్వంలో కమిటీ వేస్తామన్నారు.

ఎంతో విశాల దృక్పథంతో రాజ్యాంగాన్ని రచించారు. ఎవరో చేసిన తప్పులకు ఫలితం మనం అనుభవిస్తున్నాం. భావితరాల భవిష్యత్తు కోసం మనం ఆలోచించాలి. రాజ్యాంగంలోని పేజీల్లో అనేకమంది మతగురువుల చిత్రాలు ఉన్నాయి. మన దేశం అన్ని ధర్మాలనూ స్వీకరించింది.- పవన్ కల్యాణ్, జనసేన అధినేత

BJP on Janasena TDP Alliance For Upcoming Polls: టీడీపీతో జనసేన పొత్తు.. స్పందించిన రాష్ట్ర బీజేపీ

Last Updated : Sep 17, 2023, 6:36 AM IST

ABOUT THE AUTHOR

...view details