Janasena Tenth Formation Day Celebrations: జనసేన పదో అవిర్భావ దినోత్సవ సభ మచిలీపట్నంలో నిర్వహిస్తోంది. సభలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ నుంచి వారాహి వాహనంపై బయలుదేరారు. ఆయన వెెంట ప్రజలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలి వస్తున్నారు. ఈ సభ కాసేపట్లో ప్రారంభం కానుంది.
సభ గురించి జనసేన గతంలో తెలిపిన విధంగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలోని ఆటోనగర్‌కు చేరుకున్నారు. ఆటోనగర్‌లో ఆయనకు భారీ స్వాగతం లభించింది. భారీ గజమాలతో పవన్ కల్యాణ్‌కు పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. అనంతరం అభిమానులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో కలిసి సభలో పాల్గొనటానికి అక్కడి నుంచి.. వారాహిలో మచిలీపట్నం బయలుదేరారు. ఆయనతో పాటుగా ప్రజలు సభకు ర్యాలీగా తరలివస్తున్నారు. పార్టీ కార్యకార్తలు, శ్రేణులకు అభివాదం తెలుపుతూ పవన్ సభకు బయలుదేరారు.
సభకు తరలివెళ్తుండగా ప్రజలు ఆయనకు నీరాజనాలు పలికారు. భారీ ర్యాలీతో బయలుదేరిన జనసేనాని మచిలీపట్నం అవిర్భావ సభలో పాల్గొననున్నారు. సభ ప్రారంభానికి ముందు వేదికపై కళాకారుల సంప్రదాయ నృత్యాలు కొనసాగుతున్నాయి. ఈ సభలో కౌలురైతుల కుటుంబసభ్యులను పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. అంతేకాకుండా ఆ కుటుంబాలకు ఆర్థికసాయాన్ని అందించనున్నారు. సుమారు 47 కుటుంబాలకు ఈ సహాయం అందించనుండగా. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థికంగా ఆదుకోనున్నారు.