భాజపాను బంగాల్ అవతలి పార్టీ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించటంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీటైన సమాధానం ఇచ్చారు. భాజపా మాతృకైన జనసంఘ్ స్థాపకులు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ.. బంగాల్ పుత్రుడని గుర్తుచేశారు. భాజపాకు దేశ సమైక్యతే ముఖ్యమని, విభజన రాజకీయాలు తమ పార్టీ లక్షణం కాదని ఘట్టిగా బదులిచ్చారు. భాజపా నిర్వహించిన పరివర్థన్ యాత్రా ర్యాలీలో గడ్కరీ పాల్గొని ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
"భాజపాను బంగాల్ బయటి పార్టీగా మమతా అంటున్నారు. భారతీయ జనతా పార్టీకి మూలమైన జనసంఘ్ స్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బంగాల్‌కు చెందిన వారేనని గుర్తు చేసుకోవాలి. బంగాల్లో వామపక్ష పార్టీలకు, కాంగ్రెస్‌కు చాలా సంవత్సరాలు అధికారమిచ్చారు. తృణమూల్‌కు పది ఏళ్లు అధికారం కట్టబెట్టారు. అయిన బంగాల్లో అభివృద్ధి జరగలేదు. పైగా రాష్ట్రంలో హింస, అవినీతి పెచ్చరిల్లాయి."