తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్మూలో మరోమారు డ్రోన్ల కలకలం - డ్రోన్ల వార్తలు

జమ్మూలోని మూడు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున డ్రోన్ల సంచారం కలకలం సృష్టించింది. ఆ డ్రోన్లపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. నాలుగు రోజుల్లోనే 7 డ్రోన్ల కదలికలను గుర్తించటం ఆందోళన కలిగిస్తోంది.

Drones in jammu
జమ్మూలో మరోమారు డ్రోన్ల కలకలం

By

Published : Jun 30, 2021, 9:31 AM IST

Updated : Jun 30, 2021, 11:55 AM IST

జమ్ముకశ్మీర్​లో వరుసగా డ్రోన్ల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. బుధవారం జమ్మూ సైనిక స్థావరాలకు సమీపంలో మూడు డ్రోన్లును భద్రతా సిబ్బంది గుర్తించారు. అర్ధరాత్రి 1.30 నుంచి ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల మధ్యలో వేర్వేరు ప్రాంతాల్లో గుర్తు తెలియని డ్రోన్లు సంచరించాయి.

మొదట కాలుచుక్​ కంటోన్మెంట్​ వద్ద ఓ డ్రోన్​ కనిపించింది. ఆ తర్వాత రత్నచక్​ సైనిక ప్రాంతానికి సమీపంలో మరోదాన్ని గుర్తించారు భద్రతా సిబ్బంది. మూడోది.. కుంజ్వానీ ఎయిర్​ఫోర్స్​ స్టేషన్​ వద్ద కనిపించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. డిఫెన్స్​ ఇన్​స్టాలేషన్స్​ సమీపంలో ఇవి కదలాడినట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

గడిచిన నాలుగు రోజుల్లో మొత్తం 7 డ్రోన్లు సంచరించటం ఉగ్రదాడులపై ఆందోళన పెంచుతోంది.

జమ్మూలోని వాయుసేన విమానాశ్రయంపై డ్రోన్​ దాడి జరిగిన తర్వాత.. పలు ప్రాంతాల్లో వాటి సంచారం పెరగటం ఆందోళన కలిగిస్తోంది. వాయుసేన స్థావరంపై దాడి చేసింది ఉగ్రవాదులేనని అనుమానిస్తోంది ఎన్​ఐఏ. పాక్​ నుంచి దేశంలోకి డ్రోన్ల ద్వారా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నట్లు భావిస్తోంది.

ఇదీ చూడండి:ఆర్మీ హెడ్​క్వార్టర్​ వద్ద డ్రోన్ల​ కలకలం

Last Updated : Jun 30, 2021, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details