తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముగ్గురు ఉగ్ర అనుచరులు అరెస్ట్​- భారీగా నగదు స్వాధీనం

ఉగ్రముఠాలకు నిధులు సమకూరుస్తున్న ముగ్గురు అనుచరుల్ని అరెస్టు చేశారు జమ్ముకశ్మీర్ (Kashmir terror news)​ పోలీసులు. వారి వద్ద నుంచి రూ. 43 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

Jammu Police arrests 3 associates of terror operatives
ఉగ్ర అనుచరులు అరెస్ట్​

By

Published : Nov 18, 2021, 8:02 AM IST

కరడుగట్టిన ఉగ్రసంస్థ జైషే మహ్మద్​కు (Jaish e mohammed news) సహకరిస్తున్న ముగ్గురు అనుచరులను జమ్ముకశ్మీర్​ (Kashmir terror news) పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 43 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్​ నుంచి దక్షిణ కశ్మీర్​కు డబ్బు తరలిస్తుండగా.. సిధ్రా బ్రిడ్జి వద్ద పట్టుబడ్డారు నిందితులు.

అరెస్టైన వారిని ఫయాజ్​ అహ్మద్​ దార్​, ఉమర్​ ఫరూక్​, పర్వేజ్​లుగా గుర్తించారు.

ఉగ్రముఠాలకు నిధులు సమకూరుస్తున్నట్లు తమకు అందిన సమాచారంతో ఆపరేషన్​ నిర్వహించినట్లు వెల్లడించారు కశ్మీర్​ పోలీస్​ అధికారి చందన్​ కోహ్లీ.

నాగ్రోటా వద్ద సోదాల్లో భాగంగా.. ఉగ్ర అనుచరులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపారు పోలీసులు. ఎక్కడివెళ్తున్నారని అడగగా.. వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. అనుమానంతో పోలీసులు(Kashmir terror news).. బ్యాగ్​లు తనిఖీ చేయగా పెద్దఎత్తున డబ్బు బయటపడింది.

జైషే మహ్మద్(Jaish e mohammed news)​ బృందానికే నగదును తరలిస్తున్నట్లు వారు ఒప్పుకున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:సరిహద్దులో పాక్ డ్రోన్ సంచారం- బీఎస్ఎఫ్ కాల్పులు

ABOUT THE AUTHOR

...view details