తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వారికి చెక్ పెట్టేందుకు మహిళా జవాన్ల పహారా! - జమ్ముకశ్మీర్​లో మహిళా సైన్యం

జమ్ముకశ్మీర్​లోని గందరబల జిల్లాలో అసోం రైఫిల్స్​(Assam Rifles)కు​ చెందిన​ మహిళా జవాన్ల(women soldiers)ను మోహరించారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని చేరవేయడానికి దుండగులు స్థానిక మహిళలను వినియోగిస్తున్నారనే సమాచారంతో.. వారిని తనిఖీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్నల్ కరకోటి తెలిపారు.

Women soldiers
జమ్ముకశ్మీర్​లో అసోం రైఫిల్స్​ మహిళా సేనలు

By

Published : Jul 3, 2021, 7:25 PM IST

Updated : Jul 3, 2021, 7:47 PM IST

మహిళా సైనికుల తనిఖీలు

మహిళా ప్రయాణికులను తనిఖీ చేయడానికి జమ్ముకశ్మీర్​ గందరబల జిల్లాలో అసోం రైఫిల్స్​కు(Assam Rifles) చెందిన​ మహిళా సైనికులను (women soldiers) మోహరించారు. జాతీయ రహదారుల్లోని చెక్​ పాయింట్ల వద్ద వాహనాలను తనిఖీ చేయనున్నట్లు కర్నల్ కరకోటి తెలిపారు. క్షేత్ర స్థాయిలో నివాసితులతో మమేకమవుతూ.. భద్రతా సిబ్బందికి, ప్రజలకు మధ్య అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తారని వెల్లడించారు.

చెక్​ పాయింట్ల వద్ద మహిళా బలగాలు

ఆయుధాల చేరవేత..

ఆయుధాలను, మందుగుండు సామగ్రిని మహిళలు అక్రమంగా చేరవేస్తున్నారనే సమాచారంతో ఈ మేరకు మహిళా జవాన్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. జాతీయ రహదారుల్లోని చెక్​ పాయింట్ల వద్ద తమ సహచరులకు స్థానిక మహిళలు సహకరిస్తున్నారని అధికారులు తెలిపారు. జమ్ము కశ్మీర్​లోని కుప్వారా జిల్లాలో 2020 ఆగష్టులోనే మహిళా బలగాలను మోహరించారు. ప్రస్తుతం గందర్​బల జిల్లాలో మహిళా బలగాలు మహిళలను తనిఖీలు చేస్తున్నాయి.

తనిఖీలు చేస్తున్న మహిళా సైనికులు

"పురుష సైనికుల లాగానే మహిళా సైనికులను ఉపయోగించనున్నాము. స్థానిక ప్రజలతో కలిసిపోయి.. వారిలో చైతన్యాన్ని కలిగించే దిశగా మహిళా సేనలు పనిచేస్తాయి. భద్రతా దళాలకు ప్రజలకు మధ్య అంతరాన్ని తగ్గించడానికి సహకరిస్తాయి."

Last Updated : Jul 3, 2021, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details