తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Kashmir Snowfall: భారీ హిమపాతం.. భూతల స్వర్గంగా కశ్మీర్​! - జమ్ముకశ్మీర్​లో కురుస్తున్న మంచు

జమ్ముకశ్మీర్​లో భారీగా మంచు కురుస్తోంది. హిమపాతం ప్రభావానికి పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు శ్రీనగర్​ సహా పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

kashmir snowfall
జమ్ముకశ్మీర్​లో భారీగా హిమపాతం

By

Published : Oct 23, 2021, 12:16 PM IST

Updated : Oct 23, 2021, 1:54 PM IST

భూతల స్వర్గంగా కశ్మీర్

కొద్దిరోజులుగా కురుస్తున్న మంచుతో (Kashmir Snowfall) కశ్మీర్‌ నూతన అందాలు సంతరించుకుంది. కశ్మీర్, లద్ధాఖ్‌ ప్రాంతాలు ధవళ వర్ణంతో (Kashmir Snowfall) మెరిసిపోతున్నాయి. గుల్‌మార్గ్, సోనామార్గ్, పహల్‌గామ్, షోపియాన్, గురేజ్ ప్రాంతాలు భూతల స్వర్గంగా కనిపిస్తున్నాయి.

జమ్ముకశ్మీర్​లో భారీగా కురుస్తున్న మంచు
రోడ్లపై భారీగా పేరుకుపోయిన మంచు
కశ్మీర్​లో హిమపాతం

లద్ధాఖ్‌, ద్రాస్‌ ప్రాంతాల్లో రెండురోజులుగా ఏకధాటిగా మంచు కురుస్తోందని (Kashmir Snowfall) అధికారులు తెలిపారు. పుల్వామా, కుల్గాం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ మంచు కురుస్తోంది. దట్టమైన మంచు కారణంగా పలు చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

రోడ్లపై భారీగా పేరుకుపోయిన మంచు
రాకపోకలకు అంతరాయం

మరోవైపు పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. శ్రీనగర్​ సహా పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇదీ చూడండి :ఓటమే గుణపాఠంగా.. సరిహద్దులో శరవేగంగా వసతుల కల్పన

Last Updated : Oct 23, 2021, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details