జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాలోని నౌషేరా సెక్టార్‌లో చొరబాటుకు ప్రయత్నించిన ఓ ఉగ్రవాదిని సైన్యం మట్టుబెట్టింది. ఘటనా ప్రాంతం నుంచి ఏకే-47 రైఫిల్.. నాలుగు మ్యాగజిన్లు, పేలుడు పదార్థాలు, రెండు హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం ప్రకటించింది. 'పాకిస్థాన్ వైపు నుంచి ఉగ్రవాదుల బృందం నౌషేరా సెక్టార్‌లోని నియంత్రణ రేఖమీదుగా చొరబడేందుకు యత్నించింద'ని రక్షణ ప్రతినిధి ఒకరు తెలిపారు.
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముష్కరుడు హతం - భారత్-పాక్ సరిహద్దు సమస్య
పాక్ నుంచి భారత్‌లోకి చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదిని భద్రతా దళాలు కాల్చి చంపాయి. సమగ్ర నిఘా నెట్‌వర్క్‌తో ముష్కరుల కదలికలను నియంత్రిస్తున్నట్లు ప్రకటించింది.
ఉగ్రవాది హతం
సమగ్ర నిఘా గ్రిడ్‌ను ఉపయోగించి ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన సైన్యం.. చొరబాటుదార్లను నియంత్రించేందుకు కాల్పులు జరిపినట్లు పేర్కొంది.
ఇవీ చదవండి: