తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో​ చొరబాటు యత్నం భగ్నం, ముగ్గురు ఉగ్రవాదులు హతం - terrorists killed in kashmir

జమ్ముకశ్మీర్‌ ఉరీ​ సెక్టార్‌లోని కమల్​కోట్​ ప్రాంతం నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం, బారాముల్లా పోలీసులు కలిసి హతమార్చారు.

army
భద్రతా దళాలు

By

Published : Aug 25, 2022, 3:51 PM IST

Updated : Aug 25, 2022, 4:54 PM IST

Jammu Kashmir infiltration: జమ్ముకశ్మీర్‌ ఉరీ​ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను భారత సైన్యం, బారాముల్లా పోలీసులు కలిసి హతమార్చారు.
ఉత్తర కశ్మీర్‌ బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్‌లోని కమల్‌కోట్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ వద్ద సైన్యం, పోలీసు దళాలు గురువారం గస్తీ నిర్వహిస్తుండగా ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించారు. మదియన్​ నానక్​ పోస్ట్​ సమీపంలోని కంచెను దాటి వారంతా భారత భూభాగంలోకి చొరబడుతున్నారని భద్రతా సిబ్బంది గుర్తించారు. వారిని నిలువరించడానికి కాల్పులు జరిపగా.. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి

Last Updated : Aug 25, 2022, 4:54 PM IST

ABOUT THE AUTHOR

...view details