పాస్పోర్ట్ కోసం జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైంది. పాస్పోర్ట్ మంజూరు చేయకూడదని తనిఖీలు జరిపిన సీఐడీ పోలీసులు సూచించడం వల్లే ఇవ్వలేకపోతున్నామంటూ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం నుంచి ఈ నెల 26న ఆమెకు లేఖ వచ్చింది. అయితే విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారుల వద్ద ఈ విషయమై అపీలు చేసుకోవచ్చని అందులో సూచించింది.
మెహబూబా ముఫ్తీకి పాస్పోర్ట్ నిరాకరణ - mahabooba passport
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పాస్పోర్ట్ దరఖాస్తు తిరస్కరణకు గురైంది. సీఐడీ పోలీసులు సూచించడం వల్లే ముఫ్తీకి పాస్పోర్ట్ మంజూరు చేయలేకపోతున్నామని ప్రాంతీయ కార్యాలయం తెలిపింది.

మెహబూబాకు పాసుపోర్టు నిరాకరణ
తనకు పాస్పోర్ట్ ఇస్తే ప్రమాదకరమని సీఐడీ నివేదిక ఇచ్చినందువల్లనే అధికారులు మంజూరు చేయలేదని మెహబూబా చెప్పారు. మరోవైపు పాస్పోర్ట్ ఇప్పించాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సోమవారం హైకోర్టు కొట్టివేసింది. ఇలాంటి వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని తెలిపింది.
ఇదీ చూడండి:'ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా?'