తెలంగాణ

telangana

కశ్మీర్​లో రెచ్చిపోయిన ముష్కరులు.. ముగ్గురు సైనికులు వీర మరణం

By

Published : Aug 5, 2023, 6:35 AM IST

Updated : Aug 5, 2023, 7:18 AM IST

Jammu Kashmir Encounter Today : జమ్ముకశ్మీర్​లో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. ముష్కరులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు.

jammu kashmir encounter today
jammu kashmir encounter today

Jammu Kashmir Encounter Today : జమ్ముకశ్మీర్‌ కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులతో పోరాడుతూ ముగ్గురు జవాన్లు వీర మరణం పొందారు. ముష్కరులను మట్టుబెట్టేందుకు వెళ్లిన సైనికులు.. హలాన్‌ అటవీ ప్రాంతంలో అమరులుగా మారారు. హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు శుక్రవారం అక్కడ తనిఖీలు చేపట్టాయి.

Jammu Kashmir Jawans Killed : ఈ నేపథ్యంలోనే భారీగా ఆయుధాలను కలిగి ఉన్న ముష్కరులు ఒక్కసారిగా సైనికులపైకి కాల్పులు జరిపారు. తేరుకుని ఎదురుకాల్పులు జరిపేలోపే ముగ్గురు జవాన్లకు బుల్లెట్‌ గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డవారిని తోటి సైనికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జవాన్లు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం కుల్గామ్​ జిల్లాలో నక్కిన ఉగ్రవాదుల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు సైన్యం ప్రకటించింది.

ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్..
Terrorists Arrested At Srinagar : మరోవైపు.. శ్రీనగర్​లోని నాతిపోరాలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్​(టీఆర్ఎఫ్​)తో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి 3 హ్యాండ్ గ్రెనేడ్లు, 10 తుపాకీలు, 25 ఏకే-47 గన్​లు, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్​లో ముగ్గురు నిందితులు ఉగ్రవాద కార్యకలాపాలు జరుపుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టి వీరిని అరెస్ట్ చేశారు. నిందితులను ఇమ్రాన్ అహ్మద్ నజర్, వసీమ్ అహ్మద్, వకీల్ అహ్మద్ భట్​గా గుర్తించారు పోలీసులు.

నలుగురు ముష్కరులు హతం..
Jammu Kashmir Poonch Encounter : ఈ ఏడాది జులైలో జమ్ముకశ్మీర్​లోని పూంచ్ జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు. సూరంకోట్ మండలంలోని సింధారా ప్రాంతంలో భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్​ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారని.. అందులో భాగంగా ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయని తెలిపారు. అనంతరం భద్రతా దళాలు.. డ్రోన్​లు, ఇతర పర్యవేక్షణ పరికరాలతో నిఘా ఉంచాయని చెప్పారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated : Aug 5, 2023, 7:18 AM IST

ABOUT THE AUTHOR

...view details