Jammu Kashmir encounter: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. 2018లో షోపియన్‌లోని జైనపోరాలో జరిగిన దాడి సహా పలు ఉగ్రదాడుల్లో పాల్గొని నలుగురు పోలీసు సిబ్బంది మృతికి కారణమైనట్లుగా జమ్ముకశ్మీర్ పోలీస్ ప్రతినిధి తెలిపారు.
పుల్వామాలోని ఉజ్రాంపత్రి గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు అందిన పక్కా సమాచారంతో భద్రతా బలగాలు మంగళవారం రాత్రి నిర్బంధ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు ఆ అధికారి.
" తనిఖీల్లో భాగంగా ఉగ్రవాది ఉన్న ప్రాంతాన్ని గుర్తించి.. లొంగిపోయేందుకు బలగాలు పలుమార్లు అవకాశం కల్పించాయి. అయినప్పటికీ, బలగాలపై కాల్పులకు పాల్పడ్డాడు. ఆ దాడిని తిప్పికొట్టేందుకు జవాన్లు కాల్పులు జరపటం వల్ల ఎన్‌కౌంటర్‌గా మారింది. ఈ ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ఏ+ కేటగిరి ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి. మృతుడ్ని షోపియన్‌లోని హెఫ్ శ్రీమల్ ప్రాంతానికి చెందిన ఫిరోజ్ అహ్మద్ దార్గా గుర్తించారు."