Jammu kashmir encounter: జమ్ముకశ్మీర్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. షోపియాన్, పుల్వామా జిల్లాల్లో ఈ ఎన్కౌంటర్లు జరిగాయి. పుల్వామా జిల్లాలో ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టగా.. షోపియాన్లో జరిగిన ఎన్కౌంటర్లో లష్కర్-ఏ-తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Pulwama encounter: పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతంలోని హర్దుమీర్లో ఉగ్రవాదులు ఉన్న సమాచారంతో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడగా భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. మృతులను నదీమ్ భట్, ఐఈడీ నిపుణుడు రసూల్ అదిల్గా అధికారులు గుర్తించారు. ఘటనాస్థలి నుంచి రెండు ఏకే రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరూ.. అనేక తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నారని కశ్మీర్ ఐజీపీ తెలిపారు.