Jammu Kashmir Earthquakes: రెండు రోజులుగా వరుస భూకంపాలతో జమ్ముకశ్మీర్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం రాత్రి 11 గంటలు దాటాక రెండు భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై వరుసగా 4.1, 3.2 తీవ్రత నమోదైంది. అయితే వీటి వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు.
జమ్ము ప్రాంతంలోని కట్‌డా ప్రాంతానికి ఈశాన్యంగా 62 కిలోమీటర్ల దూరంలో, 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రాత్రి 11.04 గంటలకు.. 4.1 తీవ్రతతో మొదటి భూకంపం వచ్చింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే 11.52 గంటలకు 3.2 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది.
ఆగస్టు 23న వరుసగా ఆరు సార్లు భూమి కంపించి.. కశ్మీర్‌ను కుదిపేసింది. వీటి వలన ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగలేదని అధికారులు వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌లోని కట్‌డా, డోడా, ఉధంపుర్, కిశ్త్వాడ్ జిల్లాల్లో ప్రకంపనలు వచ్చాయి.
జమ్ముకశ్మీర్‌లో వరుస భూకంపాలు, వణుకుతున్న జనం - 2022 జమ్మూ కశ్మీర్ భూకంపాలు
రెండు రోజులుగా జమ్ముకశ్మీర్‌లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఎటువంటి ప్రాణ నష్టం కలగకపోయినా.. ఈ వరుస ప్రకంపనలతో ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు.

భూకంపం