తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్ర చెర నుంచి విడిపించి.. తల్లిదండ్రుల చెంతకు చేర్చి.. - జమ్ముకశ్మీర్​ ఉగ్రవాద సంస్థలు

ఉగ్రవాద సంస్థల్లో చేరేందుకు సిద్ధమైన 14 మంది యువకులను జమ్ముకశ్మీర్​ పోలీసులు రక్షించారు. వారికి కౌన్సిలింగ్​ ఇప్పించి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.

militants in jammu kashmir
జమ్ముకశ్మీర్​లో ముష్కరులు

By

Published : Jul 21, 2021, 9:19 AM IST

Updated : Jul 21, 2021, 11:32 AM IST

ముష్కర మూకతో చేతులు కలిపేందుకు సిద్ధమైన 14 మంది యువకుల మనసును పోలీసులు మార్చారు. కౌన్సిలింగ్​ ఇప్పించి వారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. జమ్ముకశ్మీర్​ అనంత్​నాగ్​ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

సామాజిక మాధ్యమాల ద్వారా...

18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్న ఈ యువకులు స్థానిక ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పరుచుకున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్థాన్​కు చెందిన ఉగ్రసంస్థల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరిని అనంత్​నాగ్​ జిల్లా పోలీసులు గుర్తించి తమ తల్లిదండ్రులకు మంగళవారం అప్పగించారు. ఈ కార్యక్రమంలో అనంత్​నాగ్​ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.

కొన్ని రోజుల క్రితమే ఈ యువకులను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి వీరికి కౌన్సిలింగ్​ ఇచ్చారు. తమ పిల్లలు ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారో తల్లిదండ్రులు ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూ ఉండాలని అనంత్​నాగ్​ ఎస్​ఎస్​పీ ఇంతియాజ్​ హుస్సేన్​ తెలిపారు.

"సమాజంలో గొప్ప ఆస్తి యువత. జమ్ముకశ్మీర్​, దేశప్రజల పురోగతిలో వారు నిమగ్నమయ్యేలా చూడాలి. కశ్మీర్​ యువ ఆస్తిని ఎవరూ దోచుకోకుండా వారి తల్లిదండ్రులు పర్యవేక్షిస్తూ ఉండాలి."

-ఇంతియాజ్​ హుస్సేన్​, అనంత్​నాగ్​ ఎస్​ఎస్​పీ

ఇదీ చూడండి:

Last Updated : Jul 21, 2021, 11:32 AM IST

ABOUT THE AUTHOR

...view details