జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.
కశ్మీర్లో ఎన్కౌంటర్- ముగ్గురు ముష్కరులు హతం - encounter
07:00 April 11
కశ్మీర్లో ఎన్కౌంటర్- ముగ్గురు ముష్కరులు హతం
జిల్లాలోని హదిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారంతో శనివారం రాత్రి తనిఖీలు చేపట్టాయి బలగాలు. ఈ క్రమంలో అర్ధరాత్రి ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. ఆదివారం తెల్లవారుజామున మరో ఇద్దరిని మట్టుబెట్టాయి.
ఉగ్రవాద ముఠాలో ఇటీవల చేరిన ఓ వ్యక్తిని లొంగిపోవాలని కోరినట్లు పోలీసులు తెలిపారు.
"ఉగ్రవాద ముఠాలో కొత్తగా చేరిన ఓ వ్యక్తిని లొంగిపోవాలని పోలీసులు, భద్రతా బలగాలు కోరాయి. అతని తల్లిదండ్రులు కూడా లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. కానీ, ఇతర ఉగ్రవాదులు అతడు లొంగిపోయేందుకు అంగీకరించలేదు."
- కశ్మీర్ జోన్ పోలీసులు