తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​ 'స్థానిక' పోరు- పోలింగ్​ కేంద్రాల్లో భారీ క్యూ

kashmir polls
ప్రశాంతంగా కశ్మీర్​ ఎన్నికల పోలింగ్​

By

Published : Dec 10, 2020, 7:05 AM IST

Updated : Dec 10, 2020, 9:56 AM IST

09:44 December 10

ప్రశాంతంగా కశ్మీర్​ ఎన్నికల పోలింగ్​

కశ్మీర్​లో స్థానిక సంస్థల ఐదో విడత పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. జమ్ముకశ్మీర్​లోని 37 డిస్ట్రిక్ట్​ డెవలప్​మెంట్​ కౌన్సిల్​ (డీడీసీ) నియోజకవర్గాలకు మొత్తం 2,104 పోలింగ్​ కేంద్రాల్లో ఓటింగ్​ జరుగుతోంది. వాటితో పాటు 58 సర్పంచ్​, 218 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.  

ఉదయం 7 గంటలకు ఓటింగ్​ ప్రారంభమైన క్రమంలో చలిని సైతం లెక్కచేయక పోలింగ్​ కేంద్రాలకు తరలివస్తున్నారు ఓటర్లు. ఉదంపుర్​ జిల్లాలోని ఖూన్​ గ్రామం, అనంత్​నాగ్​, గందెర్బాల్​, మండాల్​, బాకి అకెర్​, కుప్వారా ప్రాంతాల్లో పోలింగ్​ కేంద్రాల ముందు బారులు తీరారు. భారీ క్యూలైన్లు కనిపించాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్​ జరగనుంది.  

ఐదో దశలో ఓటింగ్​ జరుగుతోన్న 37 డీడీసీల్లో 17 కశ్మీర్​ డివిజన్​, 20 జమ్ము డివిజన్​లో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ కేకే శర్మ తెలిపారు. కశ్మీర్​ డివిజన్​లో మొత్తం 155 మంది (30 మంది మహిళలు), జమ్ములో 144 మంది (40 మంది మహిళలు) పోటీలో ఉన్నట్లు తెలిపారు.  

మొత్తం 8,27,519 ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. అందులో 433,285 పురుషులు, 394,234 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

09:04 December 10

ప్రశాంతంగా డీడీసీ పోలింగ్​

డీడీసీ ఎన్నికల ఐదో విడత పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. చలిని సైతం లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్​ కేంద్రాలకు తరలివస్తున్నారు. బాకి అకెర్​, కుప్వారా, గందెర్బాల్​లోని పోలింగ్​ కేంద్రాల ముందు భారీ క్యూలైన్లు కనిపించాయి. 

06:49 December 10

డీడీసీ పోలింగ్​

కశ్మీర్​లో స్థానిక సంస్థల ఎన్నికల ఐదో విడత పోలింగ్​ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అందులో భాగంగా 37 నియోజకవర్గాల్లో డిస్ట్రిక్ట్​ డెవెలెప్​మెంట్​  కౌన్సిల్​ (డీడీసీ) ఓటింగ్​ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్నాహ్నం 2 గంటల వరకు పోలింగ్​ జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ కేకే శర్మ తెలిపారు.  

కట్టుదిట్టమైన భద్రత నడుమ.. ప్రతిష్ఠాత్మకంగా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు జరిగిన 4 విడతల పోలింగ్..​ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా.. ప్రశాంతంగా ముగిశాయి. 

Last Updated : Dec 10, 2020, 9:56 AM IST

ABOUT THE AUTHOR

...view details