జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓల్డ్ శ్రీనగర్ ఖాన్యర్లో పోలీస్ బృందంపై దాడి చేశారు.
కశ్మీర్లో ఉగ్రవాదుల దాడి- పోలీసు అధికారి మృతి - srinagar news
13:57 September 12
పోలీసు బృందంపై ఉగ్రవాదుల దాడి- అధికారి మృతి
ఈ ఘటనలో ఓ పోలీసుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఎస్ఎంహెచ్ఎస్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు పోలీసు అధికారి అర్షిద్ అష్రఫ్.
''మధ్యాహ్నం 1.35 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసు బృందంపై కాల్పులు జరపగా.. పీఎస్ఐ అర్షిద్ అహ్మద్‌కు (ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్) గాయాలయ్యాయి.''
- పోలీసు అధికారి
పోలీసు బృందంపై దాడికి పాల్పడిన ముష్కరుల కోసం గాలిస్తున్నట్లు స్పష్టం చేశారు.