జమ్ముకశ్మీర్ షోపియన్ జిల్లా హంజీపోరా వద్ద ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది మృతి చెందినట్లు సైన్యం ప్రకటించింది. ఈ ఘటనలో మరో ముష్కరుడు ఏకే-56 తుపాకీతో లొంగిపోయినట్లు వివరించారు. నిర్ధిష్ట సమాచారం మేరకు పోలీసులు, సైన్యం ఈ సంయుక్త ఆపరేషన్‌ను నిర్వహించాయి.
ఏకే-56తో లొంగిపోయిన ముష్కరుడు - ఉగ్రవాదులు- సైన్యం మధ్య కాల్పులు
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో సందర్భంగా లష్కరే తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాది ఏకే-56 రైఫిల్‌తో లొంగిపోయినట్లు పోలీసులు ప్రకటించారు.
ఉగ్రదాడి-ఏకే-56తో లొంగిపోయిన ముష్కరుడు
లష్కరే తోయిబా ఉగ్రవాదులు నక్కిన ప్రదేశానికి భద్రతా దళాలు చేరుకోగానే ముష్కరులు భారీ కాల్పులకు తెగబడ్డారని.. దీంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైనట్లు సైన్యం ప్రకటించింది. ఇతర ముష్కరుల కోసం అన్వేషణ కొనసాగుతున్నట్లు తెలిపింది.
ఇవీ చదవండి:
Last Updated : Jun 26, 2021, 11:17 AM IST