జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లు 2021కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. జమ్ముకశ్మీర్ కేడర్‌కి చెందిన సివిల్ సర్వీసు అధికారుళను అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరఁ యూనియన్ టెరిటరీ (ఆగ్ముత్)లో విలీనం చేసే ఆర్డినెన్స్ ఇక చట్టరూపం దాల్చనుంది. ఈ బిల్లును శనివారం కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభ ఫిబ్రవరి8న ఆమోదం తెలిపింది.
జమ్ముకశ్మీర్‌లో సుమారు 170 కేంద్ర చట్టాలను అమలు చేస్తున్నామని జీ. కిషన్ రెడ్డి వివరించారు. అయితే బిల్లు ప్రవేశ పెట్టడంపై ప్రతిపక్షనేత కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. అసలు జమ్ముకశ్మీర్ పునర్విభజన ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అత్యవసర సందర్భాల్లో మాత్రమే ఆర్డినెన్స్ తీసుకురావాలని, అవసరం లేకున్నా ఆర్డినెన్స్ తీసుకురావడం ప్రజాస్వామ్యానికి మంచిదికాదని అన్నారు.
"జమ్ముకశ్మీర్ సున్నితమైనదని ఆ ప్రాంతానికి చెందిన వారినే సివిల్ సర్వీస్ లాంటి వాటిలో నియమించాలి. ఆర్టికల్ 370 రద్దు చేశాక కశ్మీర్ లోయలోకి కశ్మీరీ పండితులను తిరిగి తీసుకొస్తామని కేంద్రం చెప్పింది. ఇంత వరకు ఆ విషయంలో ముందడుగు పడలేదు. జమ్ముకశ్మీర్ విషయంలో తాత్కాలిక నిర్ణయాలు తీసుకోవద్దు. అక్కడి అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలు చేయండి."
-అధీర్ రంజన్ చౌదరి, ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ