జమ్ముకశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని బజ్బెహారా తిలఖాన్ ప్రాంతంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇందుకు సంబంధించి ఇద్దరు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలు నిర్వహిస్తుండగా.. తొలుత 15 'కోడైన్ పాస్పేట్' సీసాలు బయటపడ్డాయి. అయితే నిందితులను విచారించి, వారి ఇంటి పెరట్లో సోదాలు నిర్వహించగా.. భూమిలోపల మరో 1,715 బాటిల్స్ లభించాయని అధికారులు తెలిపారు.
కశ్మీర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత - codeine bottles
జమ్ముకశ్మీర్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 1,730 సీసాల 'కోడైన్ పాస్పేట్'ను స్వాధీనం చేసుకున్న కశ్మీర్ పోలీసులు.. ఇందుకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కోడైన్ పాస్పేట్ సీసాలు
దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. నంబల్ ప్రాంతానికి చెందిన లతీఫ్ అహ్మద్ షా, ఆజాద్ అహ్మద్ షాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:భద్రతా దళాల చేతిలో పాక్ స్మగ్లర్ హతం