పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి బందిపొర జిల్లా గురజ్ సెక్టార్, కుప్వారా జిల్లాలోని కెరాన్ సెక్టార్ వద్ద మధ్యాహ్నం కాల్పులకు తెబడింది పాక్ సైన్యం.
సరిహద్దుల్లో పాక్ కవ్వింపులు- భారత్ దీటైన బదులు - JK ceasefires latest news
పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణరేఖ వెంబడి పాక్ సైన్యం మళ్లీ కాల్పులకు తెగబడింది. దాయాది కవ్వింపు చర్యలకు భారత్ దీటుగా సమాధానమిచ్చింది.
సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు
బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్ వద్ద కూడా పాక్ కాల్పులు జరిపినట్లు సైన్యాధికారులు తెలిపారు. అయితే ఈ మూడు సెక్టారుల్లోనూ పాక్ సైన్యాన్ని దీటుగా తిప్పికొట్టాయి భారత్ బలగాలు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి:అండమాన్ దీవుల్లో భూకంపం