తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మళ్లీ గృహ నిర్బంధంలోకి ముఫ్తీ

జమ్ము కశ్మీర్​లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న వేళ మరోసారి మెహబూబా ముఫ్తీని గృహ నిర్బంధంలో ఉంచారు అధికారులు. ఆమె బుద్గాం జిల్లాలో ప్రచారం నిర్వహించేందుకు అనుమతి నిరాకరించారు. పోలీసులు కావాలనే తమపై ఆంక్షలు విధిస్తున్నారని పీడీపీ, ఎన్సీ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.

Jammu and Kashmir: Mehbooba Mufti put under house arrest
కశ్మీర్​ ఎన్నికల వేళ గృహ నిర్బంధంలో మెహబూబా ముఫ్తీ

By

Published : Dec 8, 2020, 12:46 PM IST

పీడీపీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి మరోసారి గృహ నిర్బంధం విధించారు జమ్ముకశ్మీర్ అధికారులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం నిర్వహించేందుకు బుద్గాం వెళ్లాల్సిన ఆమెను పోలీసులు ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదని పీడీపీ నాయకులు తెలిపారు.

ఇటీవలే పుల్వామా జిల్లాలో పీడీపీ యువజన అధ్యక్షుడు వహీద్ రెహ్మాన్​ పెరేహ్​ను కలిసేందుకు వెళ్లాలనుకున్న మెహబూబా ముఫ్తీకి అనుమతి నిరాకరించారు జమ్ముకశ్మీర్​ పోలీసులు. ఇప్పుడు ప్రచారంలో పాల్గొనకుండా గృహ నిర్బంధం విధించారు.

జమ్ముకశ్మీర్​ అధికార యంత్రాంగం తీరుపై పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ మండిపడుతున్నాయి. డీడీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించకుండా కావాలనే ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించాయి.

అయితే ఈ ఆరోపణలను మాత్రం జమ్ముకశ్మీర్​ ప్రభుత్వం తరచూ ఖండిస్తోంది. ప్రచారంలో పాల్గొనకుండా ఏ పార్టీ నాయకులపైనా నిషేధం విధించలేదని చెబుతోంది. మోహబూబా ముఫ్తీకి పుల్వామా వెళ్లేందుకు మాత్రమే అనుమతి నిరాకరించామని కశ్మీర్​ పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: దిల్లీ సీఎం కేజ్రీవాల్​ గృహ నిర్బంధం!

ABOUT THE AUTHOR

...view details