జమ్ముకశ్మీర్‌కు చెందిన అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను ఇక కేంద్రమే నేరుగా నియమించనుంది. ఇకపై వీరంతా అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్రపాలిత ప్రాంతాల (ఆగ్ముత్) కేడర్‌లోకి వస్తారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.
కేంద్రం నిబంధనలు..
జమ్ముకశ్మీర్ విభజనకు ముందు అక్కడ పనిచేస్తోన్న అధికారులు అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోస్టింగులు పొందుతారు. ఆగ్ముత్ కేడర్‌కి కేటాయించిన అధికారులు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తారని నోటిఫికేషన్ పేర్కొంది. అవసరమైతే సంబంధిత కేడర్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయవచ్చు.
జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదా, ఆర్టికల్ 370 రద్దు చేసిన ఏడాది తరువాత ఈ ప్రకటన రావడం గమనార్హం.
ఇదీ చదవండి:జమ్ముకశ్మీర్ అభివృద్ధికి రూ.28,400కోట్ల ప్యాకేజీ