జమ్మూలో మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది. బుధవారం రాత్రి జమ్మూలోని వైమానిక స్థావరానికి సమీపంలో డ్రోన్ కనిపించినట్లు అధికారులు తెలిపారు.
వైమానికి స్థావరంపై డ్రోన్ దాడి సహా.. వరుస డ్రోన్ ఘటనల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. కశ్మీర్ లోయలో శాంతిని నెలకొల్పేందుకు కీలక చర్యలు తీసుకుంటున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా నియంత్రణ రేఖ వెంబడి అదనపు బలగాలను మోహరిస్తున్నారు. సరిహద్దుల వెంబడి ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌ని మానిటర్లలో సిబ్బంది పరిశీస్తున్నారు.