నియంత్రణ రేఖ వెంబడి ఉన్న లాంచ్‌ప్యాడ్స్ వద్ద ఉగ్రకార్యకలాపాలు తగ్గలేదని సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) అదనపు డైరక్టర్ జనరల్ సురిందర్ పవార్ తెలిపారు. అయితే బలగాలు ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
నవంబర్‌లో హిమపాతం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో భారత్‌లో చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించే అవకాశం ఉంది. ఎల్ఓసీ వెంబడి ఉన్న లాంచ్ప్యాడ్ల వద్ద 250 నుంచి 300 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. అయితే 2019లో 140 మంది ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తే ఈ ఏడాది 25-30 మంది ప్రయత్నించారు.