తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హిమాచల్​లో చలి పంజా.. గడ్డకట్టిన మంచినీరు.. పైపులను మండించి సరఫరా - మంటినీటి పైపులను వేడి చేస్తున్న జలశక్తి సిబ్బంది

హిమాచల్​ ప్రదేశ్​లో ఉష్ణోగ్రతలు మైనస్ ​20 డిగ్రీల సెల్సియస్ స్థాయికి​ పడిపోవడం వల్ల అక్కడి నీరంతా ఎక్కడికక్కడ గడ్డకట్టుకుపోయింది. మంచి నీటి సరఫరా మొత్తం నిలిచిపోయింది. దీంతో పైపులను వేడి చేసి మరి ప్రజలకు నీటి అందిస్తున్నారు జల్​ శక్తి డిపార్ట్​మెంట్​ సిబ్బంది. దీంతో అక్కడి ప్రజలు సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

jal-shakti-department-workers-are-supplying-water-at-minus-temperature-in-kaza-himachal-pradesh
హిమాచల్ మైనర్​ 20 డీగ్రీల సెల్సియస్​ ఉష్ణోగ్రతలు

By

Published : Jan 25, 2023, 10:51 PM IST

హిమాచల్​లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. గడ్డకట్టిన మంచినీళ్లు

హిమాచల్​ ప్రదేశ్​లో మంచు వర్షం ప్రజలను వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. గత కొద్ది రోజులుగా అక్కడ మైనస్ ​20 డిగ్రీల సెల్సియస్​ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ ప్రాంతంలోని నీరంతా ఎక్కడికక్కడ గడ్డకట్టుకుపోయింది. మంచి నీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. నీళ్లన్ని ముందుకు వెళ్లకుండా పైపుల్లోనే గడ్డకట్టుకుపోయాయి. ప్రజల ఇళ్లకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఎగువ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. ఆ ప్రాంతం మొత్తం పూర్తిగా మంచుతో నిండిపోయింది.

హిమాచల్​లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

అయితే లాహౌల్ స్పీతి జిల్లా జల్​ శక్తి శాఖ మాత్రం.. అక్కడి నీటి సరఫరా సమస్యను తీర్చేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చేస్తోంది. పైపులను వేడి చేసి మరీ నీరు సరఫరా అయ్యేలా చూస్తోంది. దీంతో మంచు రూపంలో ఉన్న నీరంతా కరిగి ఇళ్లకు చేరుతోంది. జల్​ శక్తి డిపార్ట్​మెంట్​ సిబ్బంది చర్యలతో స్థానికులకు నీటి కష్టాలు తీరుతున్నాయి. దీంతో సిబ్బందికి స్థానికులంతా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వారు కూడా సిబ్బందికి సాయం అందిస్తున్నారు. ఇంత చలిలో సైతం ప్రజల సమస్యను తీర్చుతున్నందుకు సిబ్బందిని అధికారులు అభినందించారు. మంచి మనసుతో స్థానికుల తాగునీటి సమస్యలు తీర్చుతున్నారంటూ కొనియాడారు.

హిమాచల్​లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. గడ్డకట్టిన జలపాతం
హిమాచల్​లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. పైపుల్లో గడ్డకట్టిన మంచినీళ్లు

ABOUT THE AUTHOR

...view details