భారత్కు వచ్చే కార్గో విమానాలను అనుమతించడం సహా.. రవాణా మార్గాలను తెరిచే ఉంచాలని చైనాకు విజ్ఞప్తి చేశారు విదేశాంగ మంత్రి జైశంకర్. చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వాంగ్ యీతో శుక్రవారం ఫోన్లో మాట్లాడిన ఆయన.. భారత్లోని సంస్థలు అక్కడి తయారీదారుల నుంచి కీలక ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నారని తెలిపారు.
అమెరికా సంస్థలు తమ ఔషధ వనరులను చైనా నుంచి భారత్కు పంపించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చైనాకు చెందిన సిచువాన్ ఎయిర్లైన్స్.. విమానాలను రద్దు చేయడం వల్ల ఈ ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో సమస్యను వాంగ్ యీ దృష్టికి తీసుకెళ్లారు జైశంకర్. సప్లై చైన్ ప్రాముఖ్యతను గుర్తు చేసినట్లు జైశంకర్ తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో రవాణా విమానాల రాకపోకలను కొనసాగించాలని పేర్కొన్నారు. దీనిపై వాంగ్ యీ సానుకూలంగా స్పందించారని చెప్పారు.
కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో అవసరమయ్యే చర్యలు చేపట్టేందుకు భారత్ పూర్తిగా కట్టుబడి ఉందని జైశంకర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారని విదేశాంగ శాఖ తెలిపింది. కరోనాపై పోరాడుతున్న భారత్కు సంఘీభావం తెలుపుతామన్న చైనా అభ్యర్థన మేరకు ఈ ఫోన్ కాల్ ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ లేఖ రాసిన కొద్దిగంటలకే విదేశాంగ మంత్రుల మధ్య సంభాషణ జరగడం గమనార్హం.
తూర్పు లద్దాఖ్ అంశం