Jaishankar On India Name Change : ఇండియా పేరు మార్పుపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంపై స్పందించారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ఇండియా అంటేనే భారత్ అని.. ఆ విషయం రాజ్యాంగంలోనే స్పష్టంగా ఉందన్నారు. అందుకోసం ప్రతిఒక్కరూ రాజ్యాంగాన్ని చదవాలని కోరారు. భారత్ అనే భావనను రాజ్యాంగం సైతం ప్రతిబింబిస్తోందని చెప్పారు. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జైశంకర్.. జీ 20 సహా తదితర అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు.
"జీ 20 సదస్సు ప్రజలందరిది. పూర్తిగా ప్రజాస్వామ్య భావనలో జీ20 సదస్సును నిర్వహిస్తున్నాం. అంతకుముందు ఇలాంటి సమావేశాలు కేవలం ఒక నగరానికి మాత్రమే పరిమితమయ్యేవి. కానీ, మేము దేశ మొత్తాన్ని ఇందులో భాగస్వాములను చేయాలని అనుకున్నాం. అందుకే దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో జీ20 సమావేశాలను ఏర్పాటు చేశాం. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో సైతం వీటిని పెట్టాం. ఇది మన దేశ ప్రధాని, బీజేపీ ఆలోచన. జీ 20 సదస్సు రాజకీయాలకు వేదిక కాదు.
--ఎస్.జైశంకర్, విదేశాంగ మంత్రి
మోదీపై ప్రశంసల జల్లు
అంతర్జాతీయ వేదికపై భారత ముఖచిత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తిగా మార్చివేశారని కొనియాడారు. దౌత్యపరమైన చర్చల్లో భారత్‌ను అగ్రస్థానాన నిలిపారని ప్రశంసించారు. ప్రస్తుతం ఉన్నది సరికొత్త ప్రపంచం, నయా ఇండియా అని.. మన ప్రధానమంత్రి, ప్రభుత్వం చాలా భిన్నమైనదని చెప్పారు. ఇంతకు మునుప్పెన్నడూ ఇలాంటి ప్రభుత్వాన్ని చూసి ఉండరని తెలిపారు. ప్రపంచంలోని సమస్యల పరిష్కారానికి భారత్ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని పేర్కొన్నారు. కొవిడ్ నుంచి రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం వరకు ప్రతి రంగంలో భారత్ ప్రపంచానికి మార్గదర్శంగా నిలుస్తోందన్నారు.
పుతిన్, జిన్‌పింగ్ గైర్హాజరుపై స్పందించిన జైశంకర్
Putin G20 :జీ 20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరు కాకపోవడంపైనా స్పందించారు జైశంకర్. వీరిద్దరి గైర్హాజరు జీ 20 సమావేశాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని చెప్పారు. వారి వ్యక్తిగత కారణాల వల్ల సమావేశాలకు ప్రత్యక్షంగా హాజరు కాకపోవచ్చు.. కానీ, వారి ప్రతినిధులు హాజరై దేశ ఉద్దేశాన్ని తెలుపుతారని వివరించారు.
India Name Change Resolution : ఇండియా పేరు ఇక భారత్‌గా మార్పు! త్వరలోనే కేంద్రం తీర్మానం!! విపక్షాల ఫైర్
Bharat vs India Debate : ఇండియా X భారత్.. దేశం పేరుపై 2016లోనే సుప్రీంకోర్టు క్లారిటీ.. ఏం చెప్పిందంటే?