చైనా అధ్యక్షతన వర్చవల్‌గా జరిగిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యున్నత స్థాయి సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకాలేదు. ఆయన తరఫున విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా పాల్గొన్నారు.
చైనా-భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సమావేశానికి జైశంకర్ దూరంగా ఉన్నారు. కాగా భద్రతా మండలి అత్యున్నత స్థాయి సమావేశానికి 14 దేశాలు మంత్రి స్థాయి అధికారులను పంపించాయి.
ఈ సమావేశంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ ప్రధాన మంత్రి రాల్ఫ్ గోన్సాల్వ్స్ పాల్గొన్నారు. మరో 7 దేశాలు తమ విదేశాంగ మంత్రుల్ని పంపించాయి.
మరో ముగ్గురు సహాయమంత్రులు ఈ సమావేశానికి హజరయ్యారు. బ్రిటన్ సహాయమంత్రి తారీఖ్ అహ్మద్, ఫ్రాన్స్ సహాయ మంత్రి జీన్-బాప్టిస్ట్ లేమోయెన్, కెన్యా విదేశాంగ కార్యదర్శి రాయ్చెల్లే ఓమామో ఈ వర్చువల్ భేటీలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:అసోం సీఎం ఎవరు? ఉత్కంఠకు తెరపడేనా?