తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అంబానీ ఇంటి వద్ద ఆ కారును పార్క్​ చేసింది మేమే' - ముంబయి పోలీసులు

ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్​ అంబానీ నివాసానికి సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన కారును తామే పార్క్​ చేసినట్లు జైష్​ ఉల్​ హింద్​ ఉగ్రసంస్థ ప్రకటించుకుంది.

Jaish-ul-Hind claims responsibility of placing explosives- laden SUV near Ambani's house
'అంబానీ ఇంటి వద్ద ఆ కారును మేమే పార్క్​ చేశాం'

By

Published : Feb 28, 2021, 7:11 PM IST

రిలయన్స్‌ అధినేత ముకేశ్​ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని పార్క్‌ చేయటం తమ పనే అని జైష్‌ ఉల్‌ హింద్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఈ మేరకు ముంబయికి చెందిన ఓ పోలీసు అధికారి వెల్లడించారు.

టెలిగ్రామ్‌ యాప్‌లో ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించినట్టు విస్తృతంగా ప్రచారం జరగుతుండటం వల్ల ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ముంబయి పోలీసులు తెలిపారు.

ముంబయిలోని ముకేశ్​ అంబానీ నివాసం సమీపంలో నిలిపి ఉంచిన వాహనంలో పేలుడు పదార్థాలు లభించడం తీవ్ర కలకలం రేగింది.

ఇదీ చూడండి:అంబానీ ఇంటి వద్ద కలకలం- లేఖలో తీవ్ర హెచ్చరికలు

ABOUT THE AUTHOR

...view details