రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కి చెందిన నారపత్రం ఒక సాధారణ వ్యక్తి. ఒక్క రూపాయి కూడా సంపాదన లేకుండా కుటుంబం నుంచే నాలుగు వేలు తీసుకుంటున్న వ్యక్తికి ఏకంగా కోటికి పైగా పన్ను కట్టాలని నోటీసు వచ్చింది. పొరపాటున తెలియని వ్యక్తితో ఆధార్, పాన్ వివరాలను ఇచ్చాడు. ఆ వివరాలతో దుండగులు దిల్లీలో కంపనీని ఏర్పాటు చేశారు. కంపనీ టర్నోవర్ కోట్లకు పెరగడం వల్ల పన్ను కట్టమని నోటీసులు వచ్చాయి. తీరా ఏంటా అని ఆరాతీస్తే ఆసక్తి విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇదీ జరిగింది:
రాజస్థాన్ జైసల్మేర్‌లోని రిద్వా గ్రామానికి చెందిన నారపత్రం ఒక సాధారణ వ్యక్తి. అనుకోకుండా ఒక రోజు తెలియని వ్యక్తికి తన ఆధార్, పాన్ కార్డు వివరాలను ఇవ్వాల్సి వచ్చింది. అలా ఇచ్చిన కొన్ని వారాల తర్వాత దాదాపుగా కోటిన్నర రూపాయలు జీఎస్టీ కట్టమని డిసెంబరు 22, 2022న నోటీసులు వచ్చాయి. తీరా ఏంటా అని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తన ఆధార్, పాన్ కార్డు వివరాలతో తన పేరు మీద దిల్లీలో ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. ఆ కంపనీ కొన్ని కోట్ల రూపాయల టర్నోవర్ చేసింది. దానితో నేను పన్ను కట్దాలి అని నోటీసు వచ్చింది. మాదొక సాధారణ కుటుంబం. ప్రతినెలా నా కుటుంబమే నాలుగు వేలు నా అవసరాలకు ఇస్తుంది. కోటి రూపాయలకు పైగా పన్ను కట్టాలంటే మావల్ల కాదని చెప్పాడు. ఇలా జరిగిందని పోలీసు స్టేషనులో కంప్లయింట్ ఇవ్వటానికి వెళితే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు..అని నారపత్రం చెప్పాడు. ఓటీపీ వచ్చినప్పుడు వచ్చిన ఫోన్‌కాల్ సంభాషణలు, ఓటీపీని చెప్పడం ఇవన్నీ ఒకసారి గుర్తుచేసుకున్నాను. నేను ఇచ్చిన నా వివరాల ఆధారంగా దిల్లీలో ఒక కంపనీని ప్రారంభించినట్లు నోటీసులో పేర్కోన్నారని చెప్పాడు.
"నోటీసు వచ్చినప్పుడు నాకు భాష అర్థం కాలేదు. తర్వాత వేరొకరితో చదివించినప్పుుడు అసలు విషయం తెలిసింది. నా ఆధార్, పాన్ వివరాలను తీసుకుని మోసగాళ్లు వాటి మీద ఒక కంపెనీని రిజిస్ట్రర్ చేశారు. దీని వల్ల నాకు దాదాపుగా కోటిన్నర రూపాయలు జీఎస్టీ కట్టమని నోటీసులు వచ్చాయి"