Jaisalmer bus electric accident: విద్యుత్ తీగ.. బస్సుకి తగలడం వల్ల విద్యుదాఘాతానికి గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన జైసల్మేర్- చెలక్ రహదారిలోని గుహ్డో గ్రామం సమీపంలో మంగళవారంజరిగింది. మృతుల్లో ఇద్దరు అన్నాదమ్ములని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని జోధ్‌పూర్ ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. ఈ ప్రమాదంలో రానారామ్ మేఘ్వాల్, నారాయణ్రామ్ మేఘ్వాల్ అనే సోదరులు మరణించారు. పధ్మారామ్ మేఘ్వాల్ అనే మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు.
బస్సుకు విద్యుత్ తీగ తగిలి అన్నాదమ్ములు మృతి
Jaisalmer bus electric accident: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బస్‌కు కరెంట్ తీగ తగిలి విద్యుదాఘాతానికి గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్‌లో వ్యాన్ బోల్తా పడి ఒకరు మృతి చెందారు.
వ్యాన్ బోల్తా పడి ఒకరు ప్రాణాలను కోల్పోగా, 36 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ సమీపంలోని హరిశ్చంద్ర గ్రామ పరిధిలో సోమవారం రాత్రి జరిగిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. క్షతగాత్రుల్లో 14 మంది చిన్నారులు ఉన్నారని.. అందర్నీ ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. వ్యాన్‌లోని ప్రయాణికులు వైష్ణో దేవి ఆలయంలో పూజలు చేసేందుకు ఇక్కడికి వచ్చారని వివరించారు. మృతుడు సుశీల్(40)గా గుర్తించామని, ఈ ఘటనపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:విద్యార్థులపై ఉపాధ్యాయురాలి లైంగిక వేధింపులు.. కుమారుడిని కూడా..