తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.5వేలు తీసుకుని భార్యను బలవంతంగా ఇద్దరితో... - జైపుర్​లో సామూహిక అత్యాచారం

Jaipur gang rape: జైపుర్​లో ఒక్కరోజే నాలుగు సామూహిక అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఘటనలో సొంత భర్తే రూ.5వేలు తీసుకుని భార్యను ఇద్దరికి అప్పగించాడు. యూపీలో జరిగిన మరో ఘటనలో నడుస్తున్న కారులోనే 18 ఏళ్లు యువతిని మద్యం తాగించి రేప్ చేశారు.

jaipur-gang-rape-cases-husband-did-wife-deal-for-5-thousand-rupees
రూ.5వేలు తీసుకుని భార్యను బలవంతంగా ఇద్దరితో...

By

Published : Dec 24, 2021, 7:09 PM IST

Jaipur gang rape: రాజస్థాన్ రాజధాని జైపుర్​లో గురువారం ఒక్కరోజే నాలుగు అత్యాచార కేసులు వెలుగులోకి వచ్చాయి. మాల్​పురా గేట్, ఆమేర్, సాంగానేర్, ముహానా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ఘటనలు జరిగాయి. మాల్​పూర్​ గేట్ రేప్​ కేసులో సొంత భర్తే రూ.5వేలు తీసుకుని భార్యను ఇద్దరు వ్యక్తులకు అప్పగించాడు. డిసెంబర్​ 19న ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. తన భర్త రూ.5వేలకు ఇద్దరు వ్యక్తులతో డీల్​ కుదుర్చుకున్నాడు. ఒప్పందం ప్రకారం వాళ్లతో ఆమె గడపాలి. ఇంటికి వచ్చిన ఇద్దరినీ చూసి బాధితురాలు షాక్ అయ్యింది. ఎవరు వీళ్లు అని భర్తను అడిగింది. ఆ ఇద్దరితో గడపాలని భర్త చెప్పాడు. అందుకు ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో భర్త, ఆ ఇద్దరు వ్యక్తులు ఆమెను కొట్టి బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. అనంతరం ఇద్దరూ ఆమెపై అత్యాచారం చేశారు. ఇద్దరు నిందితుల పేర్లు గణపత్​, భోలారాం అని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తనను బలవంతంగా తీసుకెళ్తున్నప్పుడు అడ్డువచ్చిన కుమారుడ్ని కూడా కొట్టారని ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

నడుస్తున్న కారులో...

ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రాలో మరో అత్యాచార ఘటన జరిగింది. నడుస్తున్న కారులో 18 ఏళ్ల యువతికి బలవంతంగా మద్యం తాగించి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలను వీడియో తీసి ఎవరికైనా చెబితే లీక్ చేస్తామని బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులు కృష్ణ, హేమంత్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్​ 19న ఈ ఘటన జరిగింది.

పోలీసులు చెప్పిన వివరాల కృష్ణ బాధిత యువతిని 6 నెలల క్రితం సామాజిక మాధ్యమాల్లో ఫ్రెండ్ చేసుకున్నాడు. డిసెంబర్​ 19న ఆమెను కలిసేందుకు రమ్మన్నాడు. స్నేహితుడు హేమంత్​తో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఇదీ చదవండి:కేంద్రమంత్రిని బ్లాక్​మెయిల్ చేసిన గ్యాంగ్ అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details