తక్కువ సమయంలో వేగంగా దేశ భక్తి గీతాలు పాటి ఓ ఎనిమిదేళ్ల చిన్నారి ప్రపంచ రికార్డు సృష్టించింది. కేవలం 5 నిమిషాల్లోనే 28 దేశ భక్తి గీతాలు ఆలపించి ఆసియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుంది. ఆ చిన్నారే ఒడిశా జగత్సింగ్పుర్కు చెందిన సాయి సమిక్ష్య.
జిల్లాలోని కాయ్జంగా గ్రామానికి చెందిన జనరంజన్ స్వైన్, సుభాస్మిత దంపతుల కుమార్తె అయిన సాయి సమిక్ష్య.. కటక్‌లోని నారాయణ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్‌లో మూడో తరగతి చదువుతోంది. 5 నిమిషాల్లో 28 భక్తిగీతాలు పాడి ఇంతకుముందు.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కించుకుంది. ఇటీవలే.. తన ప్రతిభతో ఆసియా బుక్ ఆఫ్ రికార్డులోనూ తన పేరు నమోదు చేసుకోగలిగింది. తనకు ఉన్న సంకల్ప శక్తి ద్వారా.. 15 పేజీల్లో ఉండే పాటను ఏడే రోజుల్లోనే పూర్తిగా కంఠస్థం చేసి రాగయుక్తంగా పాడుతోందీ చిన్నారి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకోవటమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తోంది.
తల్లిదండ్రుల ప్రోత్సాహం...