దేశంలో కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఒడిశాలోని పూరి జగన్నాథుని ఆలయం నూతన విధి విధానాలను పాలకమండలి విడుదల చేసింది. ఆదివారం తప్ప.. వారంలో మిగిలిన అన్ని రోజుల్లో భక్తులకు స్వామి దర్శనం ఉంటుందని వెల్లడించింది. ఆదివారం రోజున దేవాలయ పరిసరాలను శానిటైజ్ చేస్తామని పేర్కొంది. దేవాలయ విధి విధానాలపై క్రిషన్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ స్వామి దేవాలయ అథారిటీ (ఎస్జీటీఏ) పాలక మండలి సభ్యులు సమావేశమయ్యారు.
'పూరీ' ఆలయంలో ప్రతి ఆదివారం దర్శనాలు రద్దు - కరోనా నేపథ్యంలో ఆదివారం అనుమతి ఉండని పూరి జగన్నాథుని గుడి
ఆదివారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లో భక్తులకు స్వామి దర్శనం ఉంటుందని ఒడిశాలోని పూరి జగన్నాథుని దేవాలయ పాలక మండలి వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆదివారం దేవాలయాన్ని శానిటైజ్ చేయనున్నట్లు పేర్కొంది.

ఆదివారం మినహా అన్ని రోజుల్లో పూరి జగన్నాథుని దర్శనం
ప్రతివారంలో రెండు రోజులకొకసారి రాత్రి సమయంలో.. దేవాలయంలో శానిటైజేషన్ చేయనున్నట్లు పేర్కొన్నారు. స్వామివారి దర్శనం ప్రతిరోజు ఉదయం 6గంటలకు ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. దేవాలయంలో పాటించాల్సిన విధివిధానాలను త్వరలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. భక్తులు కరోనా నియమాలను తప్పకుండా పాటించాలని కోరారు.
ఇదీ చదవండి:బారికేడ్ గ్రిల్ మధ్య తల ఇరుక్కుని విలవిల
Last Updated : Apr 3, 2021, 10:48 PM IST