Son Washed Father Feet: మధ్యప్రదేశ్ జబల్పుర్లో ఆసక్తికర ఘటన జరిగింది. సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ కార్యాలయంలోనే తండ్రి పాదాలను కడిగాడు ఓ కుమారుడు. అయితే అంతకు కొన్ని రోజుల ముందే ఆ తండ్రిని కుమారుడు ఇంట్లోంచి గెంటివేశాడు. కొడుకులో వచ్చిన ఈ మార్పునకు కారణం సిహోరా ఎస్డీఎం ఆశిష్ పాండే.
తండ్రి పాదాలు కడిగిన కుమారుడు.. ఇంట్లోంచి గెంటేసిన కొన్నాళ్లకే.. - madhya pradesh news
Son Washed Father Feet: రాత్రింబవళ్లు కష్టపడి పెంచిన కుమారుడే.. వృద్ధ తండ్రిని ఇంట్లోంచి గెంటివేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ 80 ఏళ్ల తండ్రి.. సిహోరా సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. తన గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో తండ్రీకొడుకులను నచ్చజెప్పిన ఎస్డీఎం ఆశిష్ పాండే.. వారిద్దరినీ ఒక్కటి చేశారు.
ఇదీ జరిగింది:జబల్‌పుర్‌కు చెందిన ఆనంద్ గిరి అనే 80 ఏళ్ల వృద్ధుడిని అతడి కొడుకు, కోడలు కొన్నాళ్ల క్రితం ఇంట్లోంచి గెంటివేశాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ తండ్రి.. సిహోరా ఎస్డీఎంను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకున్నారు. రంగంలోకి దిగిన ఆశిష్ పాండే.. ఆ కుమారుడికి హిత బోధ చేశారు. తండ్రి గొప్పతనాన్ని వివరించారు. దాంతో పాటే తండ్రి బాగోగులు చూసుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దీంతో వచ్చిన మార్పుతో అక్కడే తండ్రి పాదాలను కడిగాడు ఆ కుమారుడు. ఈ సంఘటన పట్ల కార్యాలయంలో ఉన్నవారు హర్షం వ్యక్తంచేశారు.
ఇదీ చూడండి:గ్రామస్థుల నీటి కష్టాలు.. మట్టి తవ్వితేనే గొంతు తడిసేది..!