మధ్యప్రదేశ్ బర్గి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ కుమారుడు విభోర్ యాదవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్ నోటు రాసి.. నివాసంలోని తన గదిలో తుపాకీతో తలపై కాల్చుకున్నాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా.. 16ఏళ్ల విభోర్ చికిత్స పొందుతూ మరణించాడు.
విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు ఆసుపత్రికి చేరారు. కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆసుపత్రి చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.