తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతు దారుణ హత్య.. మొండెం నుంచి తల వేరు చేసి... - jabalpur news

మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​లో దారుణ (madhya pradesh farmer killed news) హత్య జరిగింది. ఓ రైతును పొలంలోనే హత్య చేసి పారిపోయారు కొందరు దుండగులు. తలను మొండెం నుంచి వేరు చేసి నిందితులు తమతో పాటు తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు.

farmer beheaded in jabalpur
farmer beheaded in jabalpur

By

Published : Nov 29, 2021, 8:45 PM IST

మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​లో ఘోర హత్య (farmer beheaded in Jabalpur) జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు.. ఓ రైతు(50)ను పొలంలోనే చంపి పారిపోయారు. మృతుడి తలను మొండెం నుంచి వేరు చేశారు. జిల్లాలోని తిల్వారాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆస్తి తగాదాలే హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

రైతు మృతదేహం

గయా ప్రసాద్ అనే రైతు.. స్థానికంగా నివాసం ఉంటున్నారు. ఎక్కువ సమయం తన పొలంలోనే గడిపేవారు. సాయంత్రం వేళ పొలానికి కాపలా కాస్తున్న సమయంలో గయా ప్రసాద్​పై పలువురు దాడి చేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. అతడి తలను తమతో పాటే దుండగులు తీసుకెళ్లి ఉంటారని చెప్పారు. పొలం విషయంలో సోమవారం మధ్యాహ్నమే గయాప్రసాద్​కు కొందరితో గొడవ జరిగిందని వెల్లడించారు. ఇదే హత్యకు దారి తీసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఘటన జరిగిన ప్రదేశంలో పోలీసులు

హత్య విషయం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీనిపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసు ప్రత్యేక బృందాలు.. డాగ్ స్క్వాడ్​తో తనిఖీలు చేపట్టాయి. హత్య జరిగిన ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించాయి. మృతుడి తలతో పాటు నేరస్థులను కనిపెట్టేందుకు దర్యాప్తు ముమ్మరం చేశాయి.

ఇదీ చదవండి:ప్రియుడితో భార్య నగ్న వీడియోకాల్.. సీసీటీవీలో చూసి భర్త షాక్!

ABOUT THE AUTHOR

...view details