దేశంలో కొవిడ్ విజృంభిస్తున్న వేళ.. ప్రాణవాయువుకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్లో ఆక్సిజన్ కొరత ఏర్పడిన నేపథ్యంలో.. స్థానిక యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ప్లాంట్ల వద్ద 24 గంటలపాటు కాపలా ఉండేలా సాయుధ బలగాలను మోహరించింది. సిలిండర్లను అక్రమంగా దోచుకోవడం వంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ విధమైన చర్యలకు ఉపక్రమించింది అక్కడి యంత్రాంగం.
ఆక్సిజన్ ప్లాంట్లకు సాయుధ బలగాల రక్షణ - సిలిండర్ ప్లాంట్ల వద్ద సాయుధ బలగాల మోహరింపు
కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్‌కు అధిక డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లు లూటీ కాకుండా మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సిలిండర్ ప్లాంట్ల వద్ద ఏకంగా సాయుధ బలగాలను మోహరించింది.
ఆక్సిజన్ సిలిండర్లు
జబల్పుర్లో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న తరుణంలో.. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రాణవాయువుకు అధిక డిమాండ్ ఏర్పడింది. ఈ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో ఆక్సిజన్ సరఫరాపై జిల్లా మేజిస్ట్రేట్ ప్రత్యేక శ్రద్ధ వహించినట్టు తెలుస్తోంది.