తెలంగాణ

telangana

ETV Bharat / bharat

5 అడుగుల లోతు మంచులో ఆర్మీ సాహసం.. మహిళను కాపాడి.. - మహిళను కాపాడిన ఆర్మీ

Chinar Corps News: భారీ హిమపాతంలో చిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న మహిళను కాపాడింది భారత ఆర్మీ. దాదాపు ఐదు అడుగుల లోతు మేర మంచు పేరుకుపోగా.. అతి కష్టం మీద ఆమెను స్ట్రెచర్​పై హెలిప్యాడ్ వద్దకు తీసుకొచ్చారు జవాన్లు.

J-K: Chinar Corps evacuate woman to hospital from snow
భారీ హిమపాతం మధ్య మహిళను ఆసుపత్రికి తరలించిన సైన్యం

By

Published : Feb 12, 2022, 10:51 PM IST

Chinar Corps News: భారత సైన్యం మరోసారి ధైర్యసాహసాలను ప్రదర్శించింది. హిమపాతంలో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఫజలీ బేగం అనే మహిళను కాపాడింది భారత సైన్యం. అనారోగ్యంతో బాధపడుతున్న సదరు మహిళను బందీపూర్ జిల్లా బరౌబ్ ప్రాంతం నుంచి స్ట్రెచర్​పై హెలిప్యాడ్ వద్దకు తరలించారు.

మహిళను ఆసుపత్రికి తరలిస్తున్న అధికారులు
హిమపాతం మధ్య మహిళను తరలిస్తున్న సైన్యం

సుమారు 1.5 కిలోమీటర్లు ఐదు అడుగుల మంచులోనే ప్రాణాలకు తెగించి సదరు మహిళను హెలిప్యాడ్ వద్దకు చేర్చారు. అక్కడినుంచి బందిపోరా జిల్లాలోని ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు చినార్ కార్ప్స్​ ఆర్మీ బృందం ట్వీట్ చేసింది.

హెలిపాడ్​ వద్దకు మహిళను తీసుకువచ్చిన సైన్యం

ప్రస్తుతం శ్రీనగర్​లో ఉష్ణోగ్రతలు అత్యల్పస్థాయికి చేరినట్లు వాతావరణ శాఖ అధికారు తెలిపారు. అత్యల్పంగా మైనస్​ 8.1 డిగ్రీలుగా నమోదు అయ్యాయని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:పైనుంచి రైలు.. ట్రాక్​ మధ్యలో నక్కి బాలికను కాపాడిన యువకుడు

ABOUT THE AUTHOR

...view details