తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అక్కడి ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండా తప్పనిసరి!

జమ్ము కశ్మీర్​లోని ఓ జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని స్థానిక డిప్యూటీ కమిషనర్​ ఆదేశాలు జారీ చేశారు. 15 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు.

By

Published : Mar 29, 2021, 3:49 PM IST

Updated : Mar 29, 2021, 3:56 PM IST

Anantnag administration orders hoisting of tricolour on all govt buildings
'15 రోజుల్లో అన్ని ప్రభుత్వ భవనాల్లో జాతీయ జెండా'

జమ్ముకశ్మీర్​లోని అనంతనాగ్​ జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలపై జాతీయ జెండా ఎగుర వేయాలని డిప్యూటీ కమిషనర్​(డీసీ) ఆదేశించారు. ఈ మేరకు 15 రోజుల గడువు విధిస్తూ.. ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిర్ణయం అన్ని జిల్లాలకు ప్రేరణగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:సీఆర్​పీఎఫ్​ జవాన్లపై గ్రనేడ్​ దాడి

మువ్వన్నెల జెండాను ఆవిష్కరించేందుకు సంబంధించిన చట్టాలపై ప్రజలకు, ప్రభుత్వ సంస్థలకు అవగాహన కల్పించేందుకు.. 2002లో కేంద్ర ప్రభుత్వం 'ఫ్లాగ్​ కోడ్​ ఆఫ్ ఇండియా'ను తీసుకొచ్చినట్లు డీసీ పేర్కొన్నారు.

పతాక ఆవిష్కరణకు సంబంధించి రోజువారీ నివేదిక సమర్పించాలని తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు డీసీ. ప్రొఫార్మా ప్రకారం.. జిల్లా పేరు, అధికారిక భవనాల సంఖ్య, ఆ తేదీ నాటికి ఎగురవేసిన జెండాలు, ఎంత శాతం పని పూర్తయింది? లాంటి విషయాలను నిర్దేశించిన ఫార్మాట్​లో నివేదించాలని వివరించారు.

ఇదీ చూడండి:రైతుల హోలీ వేడుకలు- సాగు చట్టాల ప్రతులు దహనం!

Last Updated : Mar 29, 2021, 3:56 PM IST

ABOUT THE AUTHOR

...view details