జమ్ముకశ్మీర్ పుల్వామాలో స్లీపర్ సెల్(terrorist arrested) గుట్టురట్టు చేశారు పోలీసులు. లష్కరే తోయిబాకు చెందిన ఐదుగురు ఉగ్రవాద అనుచరులను(terrorist cell) అరెస్టు చేశారు. దక్షిణ కశ్మీర్లో జరిగిన గ్రనేడ్ దాడుల కేసు దర్యాప్తులో భాగంగా స్లీపర్ సెల్ నెట్వర్క్ను పోలీసులు బయటపెట్టారు.
పుల్వామాలో ఎల్ఈటీ స్లీపర్ సెల్ గుట్టురట్టు - పుల్వామాలో ఉగ్రవాదులు హతం
పుల్వామాలో స్లీపర్ సెల్ (terrorist cell) గుట్టురట్టు చేశారు జమ్ముకశ్మీర్ పోలీసులు. లష్కరే తోయిబాకు చెందిన ఐదుగురు (terrorist arrested) ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
స్లీపర్ సెల్ ముఠా అరెస్టు
మందుగుండు సామగ్రిని వివిధ ప్రాంతాలకు రవాణా చేయడంలో ఈ స్లీపర్ సెల్ ముఠా.. ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. భద్రతా దళాలపై గ్రనేడ్ దాడులకు కూడా పాల్పడ్డారని వెల్లడించారు. వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి:నాటుబాంబు పేలి- చూపు కోల్పోయిన బాలుడు