తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సర్పంచ్​ను కాల్చి చంపిన ఉగ్రవాదులు - కశ్మీర్ న్యూస్

Sarpanch shot dead: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరో దారుణానికి తెగబడ్డారు. బారాముల్లాలో సర్పంచ్​పై బుల్లెట్ల వర్షం కుర్పించారు. తీవ్ర గాయాలపాలైన అతడ్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

Sarpanch shot dead
సర్పంచ్​ను కాల్చి చంపిన ఉగ్రవాదులు

By

Published : Apr 15, 2022, 8:30 PM IST

Sarpanch Killed: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లా పత్తాన్ ప్రాంతంలోని గోష్​బుఘ్​లో ఓ సర్పంచ్​పై తూటాల వర్షం కురింపించారు. రక్తపుమడుగులో ఉన్న అతడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. చనిపోయిన సర్పంచ్ పేరు మంజూర్ అహ్మద్ అని పోలీసులు వెల్లడించారు. అతను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచినట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details