సింగిల్ డోసు కొవిడ్-19 వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)ను అనుమతి కోరింది ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్. అదే విధంగా ఇంపోర్ట్ లైసెన్స్ జారీ చేయాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు జాన్సన్ దరఖాస్తు
తన సింగిల్ షాట్ కరోనా టీకాపై మూడో దశ క్లినికల్ పరీక్షలకు డీసీజీఐ అనుమతి కోరింది జాన్సన్ అండ్ జాన్సన్. దిగుమతి లైసెన్స్ జారీ చేయాలనీ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
జాన్సన్ & జాన్సన్, జాన్సన్ కరోనా టీకా
ఈ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవడానికి త్వరితగతిన కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ(సీడీఎస్సీఓ) నిపుణుల సమావేశం ఏర్పాటు చేయాలని జే అండ్ జే కోరినట్లు తెలుస్తోంది. విదేశీ టీకాల అత్యవసర వినియోగానికి కావాల్సిన అనుమతులను మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే విదేశీ సంస్థలు ఆ మేరకు దరఖాస్తు చేసుకుంటున్నాయి.
ఇదీ చూడండి:కరోనా బాధితుల కోసం కొత్త ఆక్సిజన్ వ్యవస్థ
Last Updated : Apr 20, 2021, 9:37 AM IST