దేశంలో కరోనా రెండో ఉద్ధృతి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సి ఉందని, కానీ వారు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయి అజ్ఞాతంలో ఉన్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. ఈమేరకు ఫేస్బుక్ లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు.
"శాస్త్రీయమైన విధానాలను తిరస్కరించి మూఢ విశ్వాసాల కోసం మీరు(ప్రధాని) ప్రజాధనాన్ని వృథా చేశారు. ఆసుపత్రుల కన్నా మీ నూతన నివాస నిర్మాణానికే ప్రాధాన్యమిచ్చారు. సూపర్ స్ప్రెడర్‌గా పరిణమించే కార్యక్రమాలకు మీరు ప్రజలను ఆహ్వానించారు. భారీ ఎత్తున ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. ఆక్సిజన్ సరఫరా విషయంలో విఫలమయ్యారు. విదేశాలు పంపిన వైద్య సామగ్రి గోడౌన్లలో వారాల తరబడి నిలిచిపోయేలా వ్యవహరించారు. ప్రజలకు సరిపడా టీకాలు కొనలేకపోయారు."