కేరళలోని కుమలి-మున్నార్ రాష్ట్ర రహదారికి ఇరువైపుల దాదాపు అరకిలోమీటర్ దూరం షెల్ గార్డెన్ నిర్మించారు శిబు అనే ఔత్సాహికుడు. ఎడారి జాతికి చెందిన పైన్ మొక్కల ఆకులపై గుడ్డు పెంకును అమర్చి అందంగా తీర్చి దిద్దారు. దూరం నుంచి చూస్తే అందమైన పూలు పూసినట్లే తెల్లగా ఆకర్షణీయంగా మొక్కలు కనువిందు చేస్తున్నాయి. తెల్లగా ప్రకాశిస్తున్న ఈ ఉద్యానవనం వద్ద ఫొటోలు దిగేందుకు వాహన చోదకులు ఆసక్తి చూపిస్తున్నారు.
10 ఏళ్ల క్రితం ఇంటి పెరటిలో గుడ్డు పెంకుల ఉద్యానవనాన్ని.. శిబు ఏర్పాటు చేశారు. ఇలాంటి ఉద్యానవనాన్నే రహదారి వెంట కూడా పెంచాలని నిర్ణయించారు. అలా పెంచిన ఎగ్ షెల్ ఉద్యానవనం ఇప్పుడూ సందర్శకులను విపరీతంగా ఆకర్షిస్తోంది.
ఇదీ చదవండి:'మా పెళ్లికి రండి- కరోనా నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి!'