తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉత్తరాఖండ్​: జోరుగా సహాయక చర్యలు - uttrakhand rescue by itbp

ఉత్తరాఖండ్​లో ఆకస్మిక వరద ధాటికి గల్లంతైన వారిని కాపాడేందుకు ఇండో-టిబెటన్​ సరిహద్దు పోలీసు దళం (ఐటీబీపీ), సైన్యం నిమగ్నమయ్యాయి. ఇప్పటి వరకు 16 మందిని కాపాడారు.

ITBP in uttrakhand
ఉత్తరాఖండ్​: సహాయక చర్యలు ముమ్మరం

By

Published : Feb 7, 2021, 7:37 PM IST

ఉత్తరాఖండ్​ జల ప్రళయంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఇండో- టిబెటన్​ సరిహద్దు పోలీసు దళం (ఐటీబీపీ), సైన్యం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. చమోలీ జిల్లాలోని తపోవన్ డ్యామ్​లో చిక్కుకున్న 16 మందిని ఐటీబీపీ కాపాడింది. ​

ఉత్తరాఖండ్​: సహాయక చర్యలు ముమ్మరం
ఉత్తరాఖండ్​లో కొనసాగుతున్న సహాయక చర్యలు
సహాయక చర్యల కోసం తాళ్లను సిద్ధం చేసుకుంటున్న ఐటీబీపీ సిబ్బంది
తపోవన్ డ్యామ్​లో కొనసాగుతున్న సహాయక చర్యలు

సైన్యం సహాయక చర్యలు

ఉత్తరాఖండ్​లో సహాయక చర్యల కోసం మూడు కంపెనీల ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలతో రెండు సూపర్​ హెర్క్యులస్​ విమానాలను పంపించారు అధికారులు. వారితో పాటు 15 టన్నుల సహాయక పరికరాలను ఘజియాబాద్​ హిందాన్​ ఎయిర్​బేస్​ నుంచి పంపించారు. సైన్యం పరంగా సహాయకచర్యలను త్రిదళాధిపతి బిపిన్​ రావత్​ పర్యవేక్షిస్తున్నారు.

సహాయక చర్యల్లో ఐటీబీపీ
కాపాడిన వారికి వైద్య సహాయం అందిస్తోన్న సహాయక సిబ్బంది
తపోవన్ డ్యామ్ వద్ద చిక్కుకున్న కార్మికుడిని కాపాడుతున్న సహాయక సిబ్బంది
వైద్య సాయం అందించేందుకు తరలివస్తోన్న సహాయక సిబ్బంది

రూ.6 లక్షల ఆర్థిక సాయం

ఉత్తరాఖండ్​ వరదల్లో చిక్కుకుని మృతి చెందిన వారికి ఆర్థిక భరోసా కింద రూ.4 లక్షల ఆర్థిక సాయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్​ రావత్​ ప్రకటించారు. ప్రధాని సహాయ నిధి కింద మరో రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని కేంద్రం ప్రకటించింది.

ముప్పు లేదు..

రిషిగంగా హైడ్రో ప్రాజెక్టు దిగువ ప్రాంత గ్రామాలకు ఎలాంటి ప్రమాదకరమైన వరద ముప్పు పొంచిలేదని జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ(ఎన్​సీఎంసీ) స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details