ITBP Jobs 2023 : ఇండో - టిబెటన్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) 458 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీరు ఒప్పంద ప్రాతిపదికపై డ్రైవర్స్గా పనిచేయాల్సి ఉంటుంది. అయితే పనితీరు ఆధారంగా వీరిని శాశ్వత ఉద్యోగులుగా కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులు ఐటీబీపీ బలగాల అవసరాల మేరకు భారతదేశంలో లేదా విదేశాల్లో ఎక్కడైనా సేవలు అందించాల్సి ఉంటుంది.
కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు
ITBP Constable vacancy details :
- యూఆర్ - 195
- ఈడబ్ల్యూఎస్ - 45
- ఓబీసీ - 110
- ఎస్సీ - 74
- ఎస్టీ - 37
విద్యార్హతలు
ITBP Driver Education Qualification : ఐటీబీపీ కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు.. ప్రభుత్వ గుర్తింపు పొంది బోర్డ్ నుంచి 10వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే కచ్చితంగా చెల్లుబాటులో ఉన్న హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి
ITBP Driver Age Limit : 2023 జులై 26నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. 1996 జులై 27 నుంచి 2002 జులై 26 మధ్య జన్మించి ఉండాలి. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపు కూడా ఉంటుంది.
దరఖాస్తు రుసుము
ITBP Constable Application Fee : యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం
ITBP Driver Selection Process : ఐటీబీపీ కానిస్టేబుల్ (డ్రైవర్) ఎంపిక విధానం 5 స్టేజ్లుగా ఉంటుంది.
1. శరీర దారుఢ్య పరీక్ష (పీఈటీ/పీఎస్టీ) : అభ్యర్థులకు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ) నిర్వహిస్తారు.