ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ పెట్టిన ఐఈడీ పేలి ఐటీబీపీ(ఇండో -టిబెటిన్ సరిహద్దు పోలీసు) జవాన్ మృతి చెందాడు. ఈ ఘటన నారాయణపుర్ జిల్లాలో ఖిలాద్ గ్రామంలో జరిగింది.
ఐటీబీపీ 53వ బెటాలియన్ టీమ్ గస్తీ నిర్వహిస్తుండగా హెడ్ కానిస్టేబుల్ మంగేశ్ రామ్తెకె అకస్మాత్తుగా నక్సల్స్ పెట్టిన ఐఈడీ మీద కాలువేశాడని ఐజీ(బస్తర్ రేంజ్) సుందర్ రాజ్ తెలిపారు. దాంతో అతను చనిపోయాడని వెల్లడించారు. రామ్తెకెది మహారాష్ట్రలోని నాగ్‌పుర్.